ఎక్కడ ఉన్నా కుప్పం ఎమ్మెల్యేని, మీ మనిషిని: చంద్రబాబు 1 d ago
AP: నేను ఎక్కడ ఉన్నా కుప్పం ఎమ్మెల్యేని, మీ మనిషిని అని సీఎం చంద్రబాబు అన్నారు. రాజకీయాల ద్వారా మంచి పబ్లిక్ పాలసీ తీసుకువస్తే ప్రజల జీవితాలు బాగుపడతాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలను అణిచివేశారే తప్ప..అభివృద్ధి చేయలేదని విమర్శించారు. 1995లోనే ఎవరూ ఊహించని విధంగా విజన్-2020 గురించి మాట్లాడాను అని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు మళ్లీ స్వరాంధ్రవిజన్ 2047తో మీ ముందుకు వచ్చాం..ఏ వ్యక్తి అయిన దూరదృష్టితో, ఒక ప్రణాళిక ప్రకారం వెళ్తేనే విజయం వరిస్తుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.